Namburu Sankar Rao – Pedakurapadu YSRCP

Namburu Sankara rao

పెదకూరపాడు నియోజకవర్గంలో దూసుకెళ్తున్న వైఎస్సార్సీపీ - Namburu Sankar Rao - Pedakurapadu YSRCP

    You Are Currently Here!
  • Home
  • Blogపెదకూరపాడు నియోజకవర్గంలో దూసుకెళ్తున్న వైఎస్సార్సీపీ

పెదకూరపాడు నియోజకవర్గంలో దూసుకెళ్తున్న వైఎస్సార్సీపీ

March 26, 2024 admin 0 Comments

పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ స్పీడ్ కు ప్రతిపక్షాలు కుదేలవుతున్నాయి. ఇటీవల భారీగా వలసలు పెరగడంతో ఇప్పటికే టీడీపీ పూర్తి నైరాశ్యంలో కూరుకుపోయింది. ఇప్పుడు జనసేన పార్టీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును వ్యతిరేకిస్తూ.. చాలామంది ముఖ్యనాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో జనసేనకు క్రియాశీలకంగా ఉన్న అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామానికి చెందిన కంబాల రాంబాబు గారు ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే గారు స్వయంగా కండువా కప్పిన వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారు మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనైతికమని.. ఆ పార్టీ కార్యకర్తలు గ్రహించారన్నారు. అందుకే రెండు పార్టీల నుంచి ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారన్నారు. అలా వచ్చే వారికి తాము సాదర స్వాగతం పలుకుతామన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి హయాంలో కాపులకు అన్ని విధాలా న్యాయం జరిగిందన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలోనూ కాపులకు సముచిత స్థానం కల్పించామన్నారు. అందుకే ఆ సామాజికవర్గం నుంచి కూడా వైఎస్సార్సీపీలోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయన్నారు. అచ్చంపేట మండలం జనసేనకు పెద్ద దిక్కుగా ఉన్న కంభాల రాంబాబు గారి చేరికతో తమకు మరింత బలం చేకూరిందని.. వచ్చే ఎన్నికల్లో పెదకూరపాడులో వైఎస్సార్సీపీ జెండా ఎగిరేలా కృషి చేయాలని కోరారు.

leave a comment

X